Q. నా వివాహం నాలుగేళ్లక్రితం జరిగింది. ఒక బాబు. వివాహమైన ఆర్నెల్ల నుంచే గృహ హింస మొదలైంది. నా భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త అందరూ కలసి కట్నం ఇంకా తెమ్మని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నా జీతం కూడా తీసుకుంటున్నారు. ఈ వేధింపులను ఎలా అడ్డుకోవాలో సలహా ఇవ్వండి
-సుజిత
A. నాలుగేళ్లుగా వేధింపులు భరిస్తున్నట్లు రాసారు గానీ సమస్య పరిష్కారానికి ఏం ప్రయత్నాలు చేసారో రాయలేదు. మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో, పుట్టింటివారి ఆసరా ఉందో లేదో తెలియదు. చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు. దానికి మీరు న్యాయవాదిని సంప్రదిస్తే వివరంగా చెప్తారు. ఈ లాక్ డౌన్ సమయంలో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు, కేసులు సాధ్యం కాకపోవచ్చు. మీరు కూడా మరింతగా హింసను ఎదుర్కొంటూ ఉండి ఉంటారు. వీలయితే జాతీయ మహిళా కమిషన్ వారి హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయండి.
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]