Saturday, January 18, 2025
Homeసినిమాప‌వ‌ర్ స్టార్ సినిమాలపై క్లారిటీ ఎప్పుడో?

ప‌వ‌ర్ స్టార్ సినిమాలపై క్లారిటీ ఎప్పుడో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్’ భీమ్లా నాయ‌క్’ తో స‌క్సెస్ సాధించాడు. ఆ త‌ర్వాత హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ లో జాయిన్ అవుతారనుకున్నారు.  ఈ సినిమా స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందనుకున్నారు కానీ.. ఎప్పుడు వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్దితి. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా చాలా సార్లు షూటింగుల‌కు బ్రేక్ ప‌డింది. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న షూటింగులు ప‌క్క‌న‌పెట్టేశారు.

హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ సినిమాను కూడా ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ‌తారో క్లారిటీ లేదు. క్రిష్‌, హ‌రీష్ శంక‌ర్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తునే ఉన్నారు. అయితే.. ప‌వ‌ర్ స్టార్ మూవీస్ గురించి ఎలాంటి అప్ డేట్స్ రాక‌పోవ‌డంతో అభిమానులు అప్ డేట్స్ ప్లీజ్ అంటున్నారు. సోష‌ల్ మీడియిలో రిక్వెస్టులు పెడుతున్నారు. ప‌వ‌న్ మాత్రం రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు.

ఆగ‌ష్టులో షూటింగ్ చేద్దామ‌నుకుంటే.. ఫిలింఛాంబ‌ర్ షూటింగులు ఆపేయాల‌ని ప్ర‌క‌టించింది. దీంతో ప‌వ‌ర్ స్టార్ పై అభిమానుల ఒత్తిడి మరింత పెరిగింద‌ట‌. త్వ‌ర‌లో ప‌వ‌ర్ స్టార్ నుంచి అప్ డేట్స్ వ‌స్తాయ‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాల గురించి అప్ డేట్స్ ఇస్తారేమో చూడాలి.

Also Read : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న్యూ టార్గెట్ ఇదే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్