హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. హిమాలయాలలోని దేశ సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జాతీయ జెండా ఎగుర వేశారు. 3488 కిలోమీటర్ల పొడవైన భారత – చైనా సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో సైనికులు ఉదయమే జాతీయ జెండా ఎగురవేశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఈ రోజు ఉదయం తన నివాసంపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా సతీమణి సోనాల్ షా కూడా పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. అందులోనూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయి.

Har Ghar Tiranga

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం కోసం జెండా కోడ్‌లో మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగరేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు.

దీని ప్రకారం పగటిపూటే కాకుండా, రాత్రిపూట కూడా జాతీయ జెండాలు ఇంటిపై ఎగరేయొచ్చు. కేంద్ర ప్రచారంలో భాగంగా జెండా ఎగరవేసిన తర్వాత సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లలో డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచుకోవాలని సూచించింది.

Also Read : జాతీయవాద భావనే భారతదేశ అస్తిత్వం ఉపరాష్ట్రపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *