Saturday, January 18, 2025
HomeTrending Newsరేపటినుంచి మళ్ళీ ఫీవర్ సర్వే : హరీష్ రావు

రేపటినుంచి మళ్ళీ ఫీవర్ సర్వే : హరీష్ రావు

We are alert: రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తనీరు హరీష్ రావు వెల్లడించారు. ‘ఇంటింటికీ ఆరోగ్యం’ పేరుతో ఈ సర్వే నిర్వహిస్తామని. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం కెసియార్ ఆదేశించారని చెప్పారు. కోవిడ్ మూడో దశ పరిస్థితులపై పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.  సర్వేలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి ప్రత్యెక కిట్ అందిస్తారని తెలిపారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎం కెసియార్ ఎప్పటికప్పుడు తమకు ఆదేశాలు ఇస్తున్నారని హరీష్ రావు చెప్పారు. మార్కెట్ లో కరోనా కిట్ల కొరత ఉందని, సిఎం ముందుచూపుతో వ్యవహరించి, ఈ కిట్లు ముందస్తుగానే కొనుగోలు చేసేలా సూచనలు ఇచ్చారని వివరించారు.  రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ ఓపీ సర్వీసులు అందిస్తామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోందని, ప్రతి రోగికి 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందిస్తామని చెప్పారు.  ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, ఆయాసం ఉంటె దగ్గరలోని దవాఖానాల్లో హోం ఐసోలేషన్ కిట్ పొందాలని మంత్రి సూచించారు.

ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు వస్తాయని ఆరోగ్య సిబ్బందికి తోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఇందులో ఉంటారనిమ,  ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తారని,  లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారని పేర్కొన్నారు. వారి ఆరోగ్యాన్ని రోజు వారి మానిటర్ చేసి అవసరమైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నీతి అయోగ్ కూడా బెస్ట్ ప్రాక్టీస్ అని ప్రశంసించిందని హరీష్ రావు చెప్పారు. 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకున్నామని, వీటిని పి హెచ్ సి స్థాయి పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొని విజయవంతం చేయాలని హరీష్ రావు కోరారు.  ప్రతి ఇంటా పరీక్షలు నిర్వహించి, ముందస్తుగా వ్యాధి లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స మొదలు పెడదామన్నారు  ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉందని అలా అని నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ జరుగుతుందని, కరోనా తగ్గే వరకు ఆదివారం నాడు 2 గంటల వరకు అన్ని బస్తీ దవాఖానలు సేవలు అందిస్తాయని హరీష్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్