Wednesday, June 10, 2026
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: జర్మనీ పై ఇండియా షూటౌట్ విజయం

మహిళల హాకీ: జర్మనీ పై ఇండియా షూటౌట్ విజయం

2021-22 FIH Pro League (W): మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్-2021-22లో భాగంగా ఇండియా-జర్మనీ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా 3-0 తేడాతో షూటౌట్ విజయం సాధించింది.  మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1 తో డ్రాగా నిలవలడంతో షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ కూడా ఇదే విధంగా  షూటౌట్ జరపాల్సి రాగా జపాన్ 2-1 తో మ్యాచ్ గెల్చుకుంది, నిన్నటి పరాజయానికి ఇండియా నేడు  బదులు తీర్చుకుంది. కెప్టెన్, గోల్ కీపర్ సవిత జర్మనీని నిలువరించింది.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదటి పావుభాగంలో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి, 29వ నిమిషంలో జర్మనీ క్రీడాకారిణి ఫెలిసియా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి బోణీ కొట్టింది. 40వ నిమిషంలో ఇండియాకు చెందిన నిషా ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. తర్వాత మ్యాచ్ సమయం ముగిసే వరకూ రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీనితో పెనాల్టీ షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular