రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నామని హుజురాబాద్ లో చెప్పారు. దళిత బంధుతో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు మంత్రి పిలుపు ఇచ్చారు.
రైతుబంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుందని హరీష్ రావు అన్నారు. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత బంధు అన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, చెప్పిన అన్ని కార్యక్రమాలు సిఎం కేసిఆర్ అమలు చేసి చూపారన్నారు. అదే స్ఫూర్తితో దళిత బంధు అమలు చేసి తీరుతామని హరీష్ రావు తెలిపారు.