Tuesday, January 21, 2025
HomeTrending NewsAtchutapuram SEZ: సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాదం: ఇద్దరి మృతి

Atchutapuram SEZ: సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాదం: ఇద్దరి మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. రియాక్టర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు, వీరిని విశాఖలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, పైగా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.  ఈ ఘటన సమయంలో మొత్తం 28 మంది అక్కడ పని చేస్తుండగా  26 మంది ప్రమాదం నుంచి తప్పించుకొని బైటకు వచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్