Monday, February 24, 2025
HomeTrending Newsచైనాలో అగ్నిప్రమాదం..38 మంది సజీవ దహనం

చైనాలో అగ్నిప్రమాదం..38 మంది సజీవ దహనం

చైనాలోని హెనాన్స్‌ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగి 38 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డనట్లు స్థానిక మీడియా తెలిపింది. అన్యాంగ్ సిటీలోని ‘హైటెక్ జోన్’లో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు ఏడెనిమిది గంటల పాటు శ్రమించి రాత్రి 11 గంటలక వరకు అదుపులోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం వరకు ప్రమాదంలో 36 మృతి చెందారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న వివరాలు చైనా అధికార వర్గాలు గుట్టుగా ఉంచాయి. కోవిడ్ దగ్గర నుంచి నేరాలు, ప్రమాదాలు ఏమి జరిగినా చైనా ప్రభుత్వం ప్రమాదం జరిగిందని ప్రకటిస్తున్నా… అందుకు కారణాలు… ఎంత నష్టం జరిగింది వెల్లడించక పోవటం ఆ దేశ అధికార వర్గాలకు అలవాటుగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్