Saturday, January 18, 2025
HomeTrending Newsతంజావూరులో అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవదహనం

తంజావూరులో అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా పదకొండు మంది సజీవదహనం అయినట్లు సమాచారం. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా తిరునారు కరసు స్వామి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ మంటలు చెలరేగాయి. ఇందులో చిక్కుకున్న భక్తులలో 11 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ ఇంజన్ లకు సమాచారం ఇచ్చారు. దీంతో దాదాపు 7 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని… మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అలాగే ఆస్తినష్టం కూడా బాగా వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన గురించి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్