ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్‌పై కాల్పుల జరిపింది ఏఎస్సై గోపాల్ దాస్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా గుర్తు తెలియని దండగులు కాల్పులు జరిపినట్లుగా ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత ఏఎస్సై గోపాల్‌దాసే నిందితుడిగా తేల్చారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ దగ్గర ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఇవాళ ఉదయం అక్కడికి వచ్చారు.
మంత్రి కారు డోరు తీసుకుని దిగుతుండగానే ఏఎస్సై గోపాల్ దాస్ ఆయనపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్‌లు దూసుకెళ్లాయి. దాంతో ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించారు.
మంత్రి దాస్‌పై కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. మంత్రిపై అతడు ఎందుకు కాల్పులు జరుపాల్సి వచ్చిందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఐడీ విచారణకు ఆదేశించారు.