Saturday, April 20, 2024
HomeTrending Newsగ్రేటర్ లో తొలిరోజు 21,666 మందికి వాక్సిన్

గ్రేటర్ లో తొలిరోజు 21,666 మందికి వాక్సిన్

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం లో మొదటిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగింది. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన వారికి నేటి నుండి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను గురువారం నాడే అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది.

నగరంలో చేపట్టిన ఈ ప్రత్యేక వాక్సినేషన్ ప్రక్రియను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, సీహెచ్. మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్