Saturday, July 27, 2024
Homeతెలంగాణజీఎస్టీలో తెలంగాణ వాటా నామమాత్రమే

జీఎస్టీలో తెలంగాణ వాటా నామమాత్రమే

 

2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని, ఖర్చులు బాగా పెరిగాయన్నారు.  43వ జీఎస్టీ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు  పాల్గొన్నారు.

 

ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్రం వెచ్చిస్తోందని, ఈ పరిస్థితులలో ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధిని 3 శాతం నుంచి ఐదు‌ శాతానికి పెంచాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. ఐజీఎస్టీ నిధులు గత ఏడాది 2638 కోట్లు వచ్చాయన్నారు. ఈ ఏడాది ఐజీఎస్టీ విధులు13 వేల కోట్లు కన్సాలిటేడెటి ఫండ్ కు ఆదాయం సమకూరిందని, అందులో రాష్ట్రానికి రావాల్సిన 218 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక స్థితి గతులు బాగా లేని ఈ పరిస్థితిల్లో, పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సవంత్సరం అయినందున, రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రంలో‌ రెస్ కోర్సులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రానికి  గ్రూప్ప్ ఆఫ్ మినిస్టర్స్‌లో సభ్యత్వం ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు..

RELATED ARTICLES

Most Popular

న్యూస్