Thursday, April 25, 2024
Homeసినిమావిశేషంగా ఆకట్టుకుంటున్న విక్రాంత్‌ రోణా ఫస్ట్ గ్లింప్స్

విశేషంగా ఆకట్టుకుంటున్న విక్రాంత్‌ రోణా ఫస్ట్ గ్లింప్స్

కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్‌ రోణా’. ఇది మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. ఈ చిత్రాన్ని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేస్తున్నారు. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరా పనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది.

మెగా బడ్జెట్‌ సినిమా విక్రాంత్‌ రోణా నుంచి వస్తోన్న ప్రతి చిన్న అప్‌డేట్‌ సినిమా మీద హైప్స్ పెంచుతూ వస్తోంది.. సుదీప్ బర్త్ డే సందర్భంగా ఒళ్లు గగుర్పొడిచే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించే వ్యక్తిగా విక్రాంత్‌ రోణాని పరిచయం చేశారు. లార్డ్ ఆఫ్‌ ద డార్క్ అంటూ కిచ్చా సుదీప్‌ని పరిచయం చేసిన  విధానం, ది డెడ్‌మ్యాన్స్ యాంథమ్‌ అంటూ ఫస్ట్ గ్లింప్స్ ను ఇంట్రడ్యూస్‌ చేసిన తీరు మరో రేంజ్‌లో ఉంది.

ఈ సందర్భంగా డైరక్టర్‌ అనూప్‌ భండారి మాట్లాడుతూ “విక్రాంత్‌ రోణా ఫస్ట్ గ్లింప్స్ ‘డెడ్‌ మ్యాన్స్ యాంథమ్‌’తో సుదీప్‌ సార్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. విక్రాంత్‌ రోణా మిస్టీరియస్‌ కేరక్టర్‌ని.. పర్ఫెక్ట్ గా పోట్రే చేసింది మా ఫస్ట్ గ్లింప్స్. నేను కథను అల్లుకున్నప్పుడు, సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు ఆ భారీతనాన్ని ఫీలయ్యాను. అందులోనూ టైట్యులర్‌ రోల్‌కి సుదీప్‌ సార్‌ ఎంట్రీ ఇవ్వగానే ఆటోమేటిగ్గా విజువల్స్ గ్రాండియర్‌నెస్‌ మరో రేంజ్‌కి వెళ్లాయి. ఆ హైతో మరోసారి సుదీప్‌గారికి హ్యాపీ బర్త్ డే చెబుతున్నా” అని అన్నారు.

నిర్మాత జాక్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ “విక్రాంత్‌ రోణా ఫస్ట్ లుక్‌తో మా సుదీప్‌ సార్‌కి వార్మెస్ట్ బర్త్ డే విషెస్‌ చెబుతున్నాం. ఫస్ట్ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. మొత్తం పాజిటివ్‌ నోట్‌లో ఉంది. ఆయన ఎనర్జీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్‌ విక్రాంత్‌ రోణాని మరో రేంజ్‌లో నిలబెట్టింది” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్