Saturday, January 18, 2025
Homeసినిమా'అంజలి టాకీస్' ఫస్ట్ లుక్ విడుదల

‘అంజలి టాకీస్’ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై, తాన్యా, గిరీష్, కేకే, ఇతర ముఖ్య తారాగణంతో రూపొందిన చిత్రం ‘అంజలి టాకీస్’. ఉదయ్ కుమార్ సిహెచ్ దర్శకత్వంలో బి బాపిరాజు నిర్మించారు. అంజలి టాకీస్ అనే సినిమా హాల్ లో జరిగే ఒక హార్రర్ స్టోరీ ఇది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… అంజలి టాకీస్ ఒక థియేటర్ లో జరిగే హార్రర్ సస్పెన్స్ కథ ఇది. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులు అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశం తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. షూటింగ్ పూర్తి అయింది. ఓ కొత్త తరహా హర్రర్ మూవీ చూశామనే ఫీలింగ్ ఆడియన్స్ కలుగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం. మంజూ, జయ శ్రీ, మృణాల్, అరుణ, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్