Thursday, June 11, 2026
Homeసినిమా'అహింస' ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' విడుదల

‘అహింస’ ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ విడుదల

డైరెక్ట‌ర్ తేజ ప్రస్తుతం తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘అహింస’.యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా  దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ పాట ని విడుదల చేశారు.

ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది.

“క‌లలో అయినా, కలయికలో అయినా కలిసుండని కాలాలైనా, నీతోనే నీతోనే.. నేనెపుడు, నాతోనే నాతోనే నువ్వేపుడు…” ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. అభిరామ్ సరసన గీతిక కథానాయికగా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular