Wednesday, June 10, 2026
HomeTrending Newsలవ్ జిహాద్ కేసులో మొదటి తీర్పు

లవ్ జిహాద్ కేసులో మొదటి తీర్పు

 Love Jihad Case : లవ్ జిహాద్ చట్టం కింద యూపీలో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ చట్టం కింద తొలిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30వేల జరిమానా విధిస్తూ కాన్పూర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన 2017 మే నెలలో జరిగింది. జావేద్ అనే ముస్లిం యువకుడు తనను తాను మున్నాగా పరిచయం చేసుకొని, ఓ బాలికను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జావేద్ బాలికను తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మరుసటి రోజు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు కాబోయే భర్త ఇంటికి చేరుకున్నప్పుడు, అతను తన అసలు గుర్తింపును వెల్లడించాడని, నిఖా చేసుకుందామని అడిగాడని, దానికి తాను నిరాకరించానని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించింది. నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, యువకుడు జావేద్ ను జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ 2020 ప్రకారం తప్పుడు పేరు చెప్పి బలవంతం చేయడం, మోసపూరిత మార్గాల ద్వారా ఏ వ్యక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక మతం నుంచి మరో మతంలోకి మారకూడదని చెబుతోంది. వివాహం ద్వారా ఏ వ్యక్తి కూడా మత మార్పిడిని ప్రోత్సహించకూడదు. వివాహం చేసుకోవాలనుకునే మతాంతర జంటలు తప్పనిసరిగా రెండు నెలల ముందుగా జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలి.

బలవంతపు మతమార్పిడులకు కనీసం రూ.15,000 జరిమానాతో పాటు ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, ఎస్సీ,ఎస్టీ కమ్యూనిటీకి చెందిన మైనర్లు, మహిళలను మతమార్పిడి చేస్తే మూడు నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను చట్టం విధిస్తోంది. ఈ చట్టం కింద ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 108 కేసులను నమోదు చేశారు. యూపీలో బరేలీ జోన్‌లో 28 కేసులు, మీరట్ జోన్‌లో 23, గోరఖ్‌పూర్ జోన్‌లో11, లక్నో జోన్‌లో తొమ్మిది, ఆగ్రా జోన్‌లో 9 కేసులు నమోదయ్యాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular