Friday, April 19, 2024
HomeTrending Newsఅమర్‌నాథ్ లో కుంభవృష్టి..16కు చేరిన మృతుల సంఖ్య

అమర్‌నాథ్ లో కుంభవృష్టి..16కు చేరిన మృతుల సంఖ్య

అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షం, ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది. 40 మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. సైన్యం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అనేక మంది వరదల్లో గల్లంతయ్యారు. ఈ సంఘటన తర్వాత జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. 01942496240, 01942313149 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ప్రయాణానికి వెళ్లిన వారి వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు 18001807198 (జమ్ము), 18001807199 (శ్రీనగర్)కు వెళ్లిన యాత్రికుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా జారీ చేయబడ్డాయి. మరోవైపు ఢిల్లీ కి చెందిన NDRF నంబర్ 011-23438252 011-23438253, కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్ 0194-2496240, పుణ్యక్షేత్రం బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 0194-2313149.

నిన్న సాయంత్రం 5.30 గంటలకు అమర్‌నాథ్ గుహ సమీపంలో అకస్మాత్తుగా పడిన వర్షం, ఆకస్మిక వరదల కారణంగా గుడి సమీపంలో నిర్మించిన గుడారాలు, టెంట్లలోకి నీరు ప్రవేశించింది. బలమైన నీటి ప్రవాహంలో అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. దీంతో పాటు పలువురు నీటిలో చిక్కుకున్నారు. ఈ సంఘటన తర్వాత అమర్‌నాథ్ యాత్ర వాయిదా వేశారు. NDRF, SDRF బృందాలను సహాయక చర్యల కోసం మోహరించారు.

ప్రాథమికంగా రిలీఫ్ అండ్ రెస్క్యూ వర్క్ ఏజెన్సీలు దీనిని మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణిస్తున్నాయి. ITBPకి చెందిన రెండు కంపెనీలతో పాటు, NDRF రెండు బృందాలు కూడా సహాయ మరియు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. అయితే గుడారం దగ్గర రక్షకుల బృందాలు ఉన్నాయి కాబట్టి.. ఎక్కువ మంది ప్రయాణికులను రక్షించగలిగారు.

కొవిడ్ సంక్షోభం కారణంగా రెండేళ్లు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రకు ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల కింద యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో యాత్రి తిరిగి ప్రారంభమైంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఊహించనివిధంగా కుంభవృష్టి విరుచుకుపడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్