Friday, November 22, 2024
HomeTrending Newsజార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ కు బెయిల్

జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ కు బెయిల్

రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్‌ హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.

జార్ఖండ్‌ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జనవరి 31న అరెస్ట్‌ చేసింది. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్‌ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. అరెస్ట్‌ అనంతరం సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్