Saturday, January 18, 2025
HomeTrending Newsహ్యాట్రిక్ పై మోడీ కన్ను

హ్యాట్రిక్ పై మోడీ కన్ను

కేంద్రంలో వరుసగా మూడోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, హ్యాట్రిక్  సాధించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలు దశలవారీగా ముగుస్తున్న కొద్దీ ఇండియా కూటమి ఓటమి సుస్పష్టంగా వెల్లడవుతోందని,  అది పేకమేడలా కూలుతోందని విమర్శించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో పేద, యువత, మహిళలు, రైతుల కోసం నిర్ణయాలను తీసుకోనున్నట్లు చెప్పారు. యూపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు.

దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోందని, ప్రజలందరి ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగిందని, బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైందని స్పష్టం చేశారు.

మరోవైపు ఇండియా టుడే కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని మోడీ అభిప్రాయ పడ్డారు. ఈ నిర్ణయంతో 50శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతోందని, ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదని అన్నారు.  భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే దానిపై సందిగ్ధం ఏర్పడిందన్నారు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్