కరోన మహమ్మారి నేపథ్యంలో మూతపడిన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామీ దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికే దర్శనానికి అనుమతిస్తామని అధికారవర్గాలు స్పష్టం చేశాయి.
శబరిగిరీషుడి దర్శనానికి రోజుకు ఐదు వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 48 గంటలముందు కోవిడ్ ఆర్టి పిసిఆర్ పరీక్ష చేయించుకురావాలి. ఈ రోజు నుంచి 21 వ తేది వరకు ఐదు రోజుల వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది.