Sunday, January 19, 2025
HomeTrending Newsనేటి నుంచి సంసద్ టీవీ

నేటి నుంచి సంసద్ టీవీ

1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో నిర్వహించిన మొదటి “ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్” జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు 81వ “ఆల్ ఇండియా అసెంబ్లీ  స్పీకర్లు మరియు కౌన్సిల్ చైర్మన్ల సమావేశం” జరుగనుంది.

వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు ఆయా రాష్ట్రాల నుండి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

ఈ సందర్భంగా నేటి నుంచి నుంచి రాజ్యసభ మరియు లోక్ సభ TV లను కలిపి “సంసద్” TV గా మార్చి  ప్రసారాలను ప్రారంభిస్తారు.

తెలంగాణ నుండి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ విదానం ద్వారా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్