Friday, July 5, 2024
HomeTrending NewsG20: హైదరాబాద్ లో జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

G20: హైదరాబాద్ లో జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఈ రోజు ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారన్నారు.

‘జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నాయి. 2022లో ఇండోనేషియాలో జరిగాయి. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నాయి. తర్వాత 2024లో బ్రెజీల్ లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు చాలా కీలకమైనవి. ప్రపంచానికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసే సమావేశాలు ఇవి. జీ20 సమావేశాల్లో 46 సెక్టర్లకు సంబంధించి సమావేశాలు జరుగుతాయి. 56 నగరాల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 140కు మించి సమావేశాలు పూర్తయ్యాయి. 70 శాతం ట్రేడ్ జీ20 దేశాల నుంచే జరుగుతోంది. జీడీపీ 85 శాతం ఈ దేశాల నుంచి ఉంటుంది. 75 శాతం జనాభా జీ20 దేశాల్లోనే ఉన్నారు.

G20లో భాగంగా ఇప్పటి వరకు అగ్రికల్చర్ కు సంబంధించి మూడు జీ20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ జరిగాయి. మొదటి సదస్సు ఇండోర్‌లో, రెండోది చండీగఢ్‌లో, మూడోది వారణాసిలో జరిగింది. భాగ్యనగరంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వ్యవసాయ మంత్రుల స్థాయి సమావేశాల్లో G20లోని 19 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొంంటారు. భారత్ తో కలిపి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్ , జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా , సౌదీ అరేబియా, టర్కీ , యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.

9 గెస్ట్ కంట్రీల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్ , ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , వియత్నాం మంత్రులు సమావేశానికి హాజరవుతారు. అలాగే 10 అంతర్జాతీయ సంస్థల హెచ్ఓడీలు హైదరాబాద్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇక్రిశాట్, WFP, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్, ఆహారం మరియు వ్యవసాయ రంగ సంస్థలు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధన సంస్థం, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రిడెవలప్‌మెంట్ సంస్థ, ERIA సంస్థ, వరల్డ్ బ్యాంక్ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.

ఈ సమావేశాల్లో..ఆహార భద్రత, పోషకాహారం కోసం సుస్థిర వ్యవసాయం మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయం – జీవ వైవిధ్యత వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయంలో రావాల్సిన మార్పులు అనే అంశాలపై చర్చిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమపద్ధతులు, వ్యవసాయ విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలు కూడా హైదరాబాద్ హైటెక్స్ లో సమావేశాల్లో చర్చకు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు

జూన్ 19 నుం చి 22 వరకు గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశాలు

” అలాగే టూరిజం మంత్రిగా నా సమావేశాలు జరుగుతున్నాయి. జూన్ 19 నుం చి 22 వరకు గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. పర్యాటక శాఖకు సంబంధించిన తొలి వర్కింగ్ గ్రూప్ సమావేశం గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌లో, రెండోది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో, మూడోది ఇటీవలే శ్రీనగర్‌లో జరిగింది. పాకిస్థాన్ మరికొన్ని దేశాలు శ్రీనగర్ లో జీ20 టూరిజం మీటింగ్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ మిలటరీ సవాళ్లు విసిరింది. వాళ్లు ఇతర దేశాలకు ఉత్తరాలు రాసి తప్పుడు ప్రచారం చేశారు. భారతదేశం వెళ్లినా జమ్ముకశ్మీర్ వెళ్లకూడదని కొన్ని దేశాలు అడ్వైజరీస్ ఉన్నాయి. అయినా ప్రతినిధులు మోదీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో శ్రీనగర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అద్భుతంగా సమావేశాలు జరిగాయి. శాంతియుతంగా, సంతోషకరంగా సమావేశాలు జరిగాయి. పాకిస్థాన్ తలదించుకునేలా సమావేశాలు నిర్వహించాం.

గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజంకు సంబధించి ఒక డిక్లరేషన్ ఈ సమావేశంలో తీసుకురానున్నాం. గోవా రోడ్ మ్యాప్ టూరిజం తీర్మానంపై సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ సమావేశాల్లో భారతదేశం కేంద్రంగా క్రూయిజ్ టూరిజం అభివృ ద్ధి, ప్రపంచ పర్యాటకాభివృద్ధిలో ప్రభుత్వ ,ప్రయివేటు భాగస్వామ్యం అనే అంశంపై మంత్రులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ సమావేశాల సం దర్భంగా గోవా, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి

జీ20 ఫైనల్ మీటింగ్స్ సెఫ్టెంబర్ లో జరగనున్నాయి. దానికంటే ముందు సాంస్కృతిక శాఖ మీటింగ్స్ వారణాసిలో జరగనున్నాయి. దీనికి సంబంధించి మొదటి సమావేశాలు మధ్యప్రదేశ్ నిర్వహించాం. హంపీలో కూడా సమావేశాలు జరగాల్సి ఉంది. ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తాం. జీ20 ఫైనల్ మీటింగ్స్ మన దేశంలో ప్రగతి మైదాన్ లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతాయి. జీ20 దేశాలు, ఆతిథ్య దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఈ మీటింగ్స్ కు రానున్నారు. ” అని కిషన్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్