Wednesday, March 18, 2026
Homeసినిమాఈ సారైనా సుడిగాలి సుధీర్ హిట్ కొట్టేనా?

ఈ సారైనా సుడిగాలి సుధీర్ హిట్ కొట్టేనా?

సుడిగాలి సుధీర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ‘జబర్దస్త్’ ద్వారా పాప్యులర్ అయిన సుధీర్, యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. సుధీర్ కి కామెడీ కొట్టిన పిండి .. ఇక ఈ కుర్రాడికి డాన్స్ లోను కావాల్సినంత నైపుణ్యం ఉంది. ఆ క్రేజ్ తోనే హీరోగా అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతున్నాడు. బడ్జెట్ పరంగా చూసుకుంటే అవి చిన్న సినిమాలే అయినా, ఆడియన్స్ తో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు.

అలా ఆయన ‘నేనోరకం’ సినిమాతో తెరపైకి హీరోగా వచ్చాడు. ఆ తరువాత రూపొందిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ రిలీజ్ కి ముందు బజ్ పెంచుకుని వెళ్లింది. కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత అతను ‘త్రీ మంకీస్’ లో కనిపించినా, దాని వలన లభించిన ప్రయోజనం కూడా  అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఆయన ‘గాలోడు’ అనే సినిమాను చేశాడు. ఈ సారి ఆయన మాస్ ను ఆకట్టుకునే ఆలోచనతో ఈ సినిమాను చేశాడు.

సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, విడుదలకి సిద్ధమై చాలాకాలమే అయింది. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. మొత్తానికి ఈ నెల 18వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి  దర్శకత్వం వహించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. సుధీర్ జోడీగా గెహెనా సిప్పీ అలరించనుంది. బలమైన తారాగణం లేకుండా బరిలోకి దిగుతున్న ఈ సినిమాను సుధీర్ ఎంతవరకూ ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తాడనేది చూడాలి.

Also Read :  సుడిగాలి సుధీర్‌ గాలోడు టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular