Saturday, June 13, 2026
HomeTrending Newsరాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతో పాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ నేడు జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 64 ను తేదీ. 16 .11 .2022 ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15  ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టేందుకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పాటయ్యే ఫైర్ స్టేషన్లు నియోజక వర్గాల వారిగా

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి.
రంగారెడ్డి జిల్లా – ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్,
హైదరాబాద్ జిల్లా – అంబర్ పెట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్,
జనగామ – స్టేషన్ ఘనపూర్.
మహబూబాబాద్ – డోర్నకల్
మెదక్ – నర్సాపూర్
సిద్ధిపేట – హుస్నాబాద్
నాగర్ కర్నూల్ – కల్వకుర్తి
నిజామాబాద్ – బాల్కొండ.
జగిత్యాల – ధర్మపురి.
భద్రార్డీ కొత్తగూడెం – పినపాక

Also Read : కుమురం భీమ్ జిల్లాలో ఏడు కొత్త పోలీస్ స్టేషన్ల ప్రారంభం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular