Friday, March 29, 2024
Homeసినిమాప‌వ‌న్ కోసం రాసిన క‌థ‌తో స‌త్య‌దేవ్

ప‌వ‌న్ కోసం రాసిన క‌థ‌తో స‌త్య‌దేవ్

Same Story: ఇండ‌స్ట్రీలో ఒక‌రి కోసం రాసుకున్న క‌థ మ‌రొక‌రి వ‌ద్ద‌కు వెళ్ళ‌డం కామ‌న్. ఒక హీరో కోసం రాసుకున్న క‌థ మ‌రో హీరోకి సెట్ అవ్వ‌డం ఎన్నో సార్లు జ‌రిగింది. అలాంటిదే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం రాసుకున్న క‌థ స‌త్య‌దేవ్ కి సెట్ అయ్యింది. ప‌వ‌ర్ స్టార్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. వ‌కీల్ సాబ్ తో సినిమా రీ ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ సాధించిన ప‌వ‌ర్ స్టార్ రీసెంట్ గా భీమ్లా నాయ‌క్ అంటూ మ‌రో స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు హ‌ర హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్, స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో ఓ మూవీ, సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌నున్నారు. ఇలా వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌నే అనుకుంట ప‌వ‌న్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌క స‌త్య‌దేవ్ తో సినిమా చేశాడు ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్. అదే.. గాడ్సే మూవీ. ఈ సినిమాని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఇంత‌కీ ప‌వ‌న్ కోసం రాసుకున్న ఈ క‌థ ఏంటంటే… మన దేశంలో 93 శాతం యువత తమ చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమే దీనికి కారణం. ఈ సామాజిక సమస్యను చర్చిస్తూ, సందేశాత్మకంగా సాగే చిత్రమే మా గాడ్సే అని దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి తెలియ‌చేశారు. పవ‌న్ తో ఈ సినిమాని చేయ‌డం కుద‌ర‌లేదు.. కుదిరితే ఆయనకు చూపించాలను కుంటున్నాను అని ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ అన్నారు. మ‌రి.. ప‌వ‌న్ క‌నుక ఈ సినిమా చూస్తే.. ఏమంటారో చూడాలి.

Also Read : స‌త్య‌దేవ్ గాడ్సే రిలీజ్ డేట్ ఫిక్స్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్