నేటి నుంచి షూటింగ్ కు దీపిక?

Deepika is ok! పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే సినిమాలోనూ న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తోంది. బిగ్ బి అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. దీపిక ప‌డుకునే అస్వ‌స్థ‌కు గురైంద‌ని.. హాస్ప‌ట‌ల్ లో చేరింద‌నే వార్త‌లు రావ‌డంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… దీపికా ప్ర‌భాస్ మూవీ ప్రాజెక్ట్ కే షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చింది. ఆదివారం నాడు ఉదయం షూటింగ్‌ సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు లో బీపీ వల్ల ఇబ్బంది కలిగినట్ఎలు నిర్దుధారించారు.

దీంతో ఆమెకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదట పడడంతో  సాయంత్రానికి  ఆమెను డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత నోవాటెల్‌కు వెళ్లి అక్కడ రెండు రోజులుగా ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని స‌మాచారం. ఈరోజు నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతున్నార‌ని తెలిసింది.

Also Read : ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే లో మ‌రో బాలీవుడ్ బ్యూటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *