Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

I am Happy: అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా ‘హీరో’. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాత‌. జ‌గ‌ప‌తిబాబు, న‌రేశ్, బ్ర‌హ్మాజీ, మైమ్ గోపీ, రోల్ రిడా త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ “మొద‌టిరోజు దేవీ థియేట‌ర్ లో సినిమా చూశాక ప్రేక్ష‌కుల పాజిటివ్ స్పంద‌న ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నాను. అందుకే సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. నా ఇష్టం గ్ర‌హించి న‌న్ను ఇంతవ‌ర‌కు తీసుకువ‌చ్చిన అమ్మా, నాన్న‌ల‌కు థ్యాంక్స్‌. అలాగే ద‌ర్శ‌కుల టీమ్‌కు థ్యాంక్స్‌. జ‌గ‌ప‌తిబాబు గారు చాలా బాగా చేశారు. బ్ర‌హ్మాజీ క్ల‌యిమాక్స్‌ లో అదిరిపోయేలా న‌టించారు. అలాగే న‌రేష్‌, మైమ్ గోపీ, రోల్ రిడా పాత్ర‌లు ఎంత‌గానో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. నిధి ల‌క్కీచామ్‌గా త‌యారైంది. డ్యాన్స్ ప‌రంగా నాకు విజ‌య్ శిక్ష‌ణ ఇచ్చాడు. ఆయ‌న చేసిన పాట‌ల‌కు థియేట‌ర్ల‌లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది అన్నారు.

జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ “నేను గ‌త 15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు. ఈ సినిమాకోసం వెళ్ళి చూశాను. పెద్ద‌గా న‌వ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మొద‌ట్లో ఈ సినిమా చేయ‌వ‌ద్ద‌ని అనుకున్నా. పెద్ద సినిమాల‌లో న‌టించిన నాకు కొత్త హీరో, ద‌ర్శ‌కుడుతో చేయాల‌నిపించ‌లేదు. కానీ ప‌ద్మ‌గారు మా సోదరికి ఒక‌టికి ప‌దిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుంద‌ని ఒప్పించారు. స‌రేలే చేద్దాం అని చేశాను. జ‌య‌దేవ్ నాకిష్ట‌మైన వ్య‌క్తి. ఇక సినిమా చేసేట‌ప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ ద‌ర్శ‌కుడు నా అంచనాల‌ను తారుమారు చేసి ప్రేక్ష‌కులు ఎంజ‌య్ చేసేలా చేశాడు. ఈ సినిమా చూశాక నేను చేసిన హ‌నుమాన్ జంక్ష‌న్ గుర్తుకువ‌చ్చింది. ఇలాంటివి తీయాలంటే ద‌ర్శ‌కుడు గొప్ప‌త‌నం చూపించాలి. హీరో అశోక్‌లో త‌ప‌న క‌నిపించింది. ఒక‌టికి రెండు సార్లు సీన్ బాగా వ‌చ్చేదాకా చేసేవాడు. ఇక న‌రేశ్ పాత్ర చాలా క్రూరంగా వుంది. ఒక‌ర‌కంగా జ‌ల‌సీ క‌లిగేలా ఆ పాత్ర చేసి మెప్పించాడు” అని తెలిపారు.

శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ “థియ‌ట‌ర్ల‌లో నిజమైన పండుగ‌లా వుంది. క‌ష్ట‌ప‌డి చేసినందుకు ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ మాకు చాలా సంతోషాన్ని క‌లిగించింది. మైమ్ గోపీ ఇంట‌ర్‌వెల్ సీన్ అద్భుతంగా పండించారు. న‌రేశ్ గారు న‌ట‌న హాయిగా న‌వ్వించేలా చేశారు. ఇక అశోక్ ప‌డిన క‌ష్టం చ‌క్క‌గా క‌నిపించింది. నిధి చాలా నాచుర‌ల్‌గా చేసింది. బ్ర‌హ్మాజీ చివ‌రి 10 నిముషాలు హైప్ కు తీసుకెళ్ళాడు. ఆయ‌న పాత్ర రాసుకున్న‌పుడు డేట్స్ లేక‌పోయినా వేరే సినిమాకు స‌రిచేసి మాకు ఇచ్చారు. పాత్ర‌పంగా ఆయ‌న గ‌ట్టిగా అరుస్తాడు. అది థియ‌ట‌ర్‌లో చూడాల్సిందే. ఇక నిర్మాత ప‌ద్మావ‌తి గారిలో సినిమా విడుద‌ల త‌ర్వాత నుంచి సంతోషం క‌నిపించింది. చాలా మంది ఆమెకు ఫోన్ల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌య‌దేవ్ గ‌ల్లా గారు మా వెనుక వుండి నడిపించారు. నేను నాలుగు సినిమాలు చేసినా ఈ సినిమాకు వ‌చ్చిన స్పంద‌న ఏ సినిమాకూ రాలేదు. అదిరిపోయింది. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాల‌నే సినిమా తీశాం. జ‌గ‌ప‌తిబాబు గారు రాజ‌మండ్రిలో కోవిడ్ టైంలో నీళ్ళ‌లో మున‌గాలి. ఆ సీన్ కు ఎదురు చెప్ప‌కుండా చేసేశారు. సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్”  చెప్పారు.

Also Read : సంక్రాంతికి మంచి వినోదం క‌లిగించే సినిమా ‘హీరో’ : శ్రీరామ్ ఆదిత్య‌

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com