Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్National Games: బ్యాడ్మింటన్ లో తెలంగాణకు మూడు స్వర్ణాలు

National Games: బ్యాడ్మింటన్ లో తెలంగాణకు మూడు స్వర్ణాలు

గుజరాత్ లో జరుగుతోన్న జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు  సాయి ప్రణీత్, సిక్కీ రెడ్డి, గాయత్రి గోపీ చంద్…. టెన్నిస్ పురుషుల డబుల్స్ లో ఏపీ  ప్లేయర్లు శివదీప్- అనంతమణి పతకాలు సాధించారు.

పురుషుల సింగిల్స్ లో సాయి ప్రణీత్ 21-11; 12-21;21-16 తేడాతో కర్ణాటక ప్లేయర్ మిథున్ మంజునాథ్ పై గెలుపొందాడు.

మహిళల డబుల్స్ లో సిక్కీ రెడ్డి- గాయత్రి 21-14; 21-11 తో అశ్విని భట్-శిఖా గౌతమ్ (కర్ణాటక)పై విజయం సాధించారు.

ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో తెలంగాణా ఏడు స్వర్ణం. ఏడు రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 18 మెడల్స్ సాధించి 14వ స్థానంలో నిలవగా,  ఆంధ్ర ప్రదేశ్ రెండు స్వర్ణం, ఎనిమిది రజతం, నాలుగు కాంస్య పతకాలతో 18వ స్థానంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular