Sunday, June 14, 2026
Homeసినిమా‘భీమ్లా నాయక్’ కోసం మేం ఎదురు చూస్తున్నాం

‘భీమ్లా నాయక్’ కోసం మేం ఎదురు చూస్తున్నాం

Gani.. stay tuned: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన‌ సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. Renaissance పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌లో సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు.

అయితే.. అదే రోజు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రానుండటంతో ‘గని’ సినిమాను వాయిదా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా ‘గని’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండటంతో.. మా సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మాస్ జాతర థియేటర్స్‌ లో చూడ్డానికి మీలాగే మేం కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ‘గని’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం” అంటూ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular