Saturday, September 21, 2024
HomeTrending Newsఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి

ఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి

హైదరాబాద్ విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ నిప్పురవ్వ షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ హమీద్ పాశ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన అక్షరాలతో ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మతమౌఢ్యం పై లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం సాధించిన వీరోచిత పోరాటాన్ని స్మరించి ప్రతి ఒక జర్నలిస్టు స్ఫూర్తి పొందాలన్నారు. నిరంకుశత్వంపై, ప్రజలపై అన్యాయం చేస్తే అక్షరమే అలాంటి సందర్భంలో ఆయుధం అవుతుందని షోయబుల్లాఖాన్ నిరూపించారన్నారు.

సామాజిక కార్యకర్త బిఎస్పి నాయకులు బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ కలానికి సైద్ధాంతిక తోడైతే స్వేచ్ఛ ఉందన్నారు. ఒక్క సిరా చుక్క అక్షర రూపం దాల్చి లక్షల మెదళ్లకు కదలిక తీస్తుందని షాయబుల్లాఖాన్ నిరూపించారని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించాలి అనే తపన నరనరాన ఉన్నటువంటి షాయాబుల్లా ఖాన్ అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వెంకటేష్ ,పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు బిసుకుంట్ల సత్యనారాయణ, కౌన్సిలర్ నజీమా సుల్తాన్,ఎం.డి మాజహర్,కబీర్, బీజేపీ మైనార్టీ నాయకులు మహబూబ్, జర్నలిస్టులు ఎం.డి,ఖాజా భాయ్,ఫారూఖ్, ఇంతియాజ్,సుజావుద్దీన్, సలావుద్దీన్,శానుర్ బాబా,కిషన్,ఇసాక్, జాకీర్,తాహెర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్