Saturday, January 18, 2025
Homeసినిమా'గాడ్ ఫాద‌ర్' ట్రైల‌ర్ అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు?

‘గాడ్ ఫాద‌ర్’ ట్రైల‌ర్ అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాద‌ర్‘. ఈ చిత్రానికి మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి ఇది రీమేక్.  ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు  అనౌన్స్ చేశారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌క‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ బాగా ఫీల‌వుతున్నారు.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండడంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. గాడ్ ఫాద‌ర్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఎప్పుడు,  ప్రీ రిలీజ్ ఎక్క‌డ అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…ట్రైలర్ ని ప్రీ రిలీజ్ రోజునే విడుదల చేయాల‌ని డిసైడ్ ఆయారట.

సెప్టెంబర్ 25నే రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంత‌పురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అక్క‌డ ఆల్రెడీ ఏర్పాట్లు మొద‌లుపెట్టార‌ని టాక్ వినిపిస్తోంది. దీని పై  అధికారికంగా అప్ డేట్ రావాల్సి ఉంది. మ‌రి.. ఆచార్య మూవీతో మెప్పించ‌లేక‌పోయిన మెగాస్టార్.. గాడ్ ఫాద‌ర్ మూవీతో ఆక‌ట్టుకుని స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read: గాడ్ ఫాద‌ర్ పై ఫైర‌వుతున్న ఫ్యాన్స్..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్