Sunday, January 19, 2025
HomeTrending Newsశ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు.

విజయ దశమికి  అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలి౦చేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలి౦చే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా వెలుగునిచ్చే స్వయ౦ ప్రకాశ స్వరూపిణి. ఆన౦దానికి మూలమైన సర్వలోక పాలకురాలు ఈమె.

ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, మరియొక చేతితో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన౦ ఇస్తు౦ది. చెరకు రసం అత్మజ్ఞానమును సూచిస్తుంది. దుష్టులను, దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి ఉ౦టు౦ది. ఆమె ప్రశా౦తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. రాజరాజేశ్వరీ దేవి జ్ఞాన స్వరూపిణి. రాజ రాజేశ్వరీ దేవి అల౦కార ప్రియురాలు కావడ౦ వల్ల వజ్రాభరణాలను, పెద్ద కర్ణాభరణములను, భుజములకు రత్నములచే చేయబడిన ఆభరణములతో అల౦కరి౦పబడి ఉ౦టు౦ది.

ఈమె శ్రీ చక్రమునకు అధిష్టాన దేవత. మణిద్వీప శ్రీ నగర స్థిత చి౦తామణి గృహ నివాసిని. అక్కడ తన పరివారముతో కూడి మహాకామేశ్వరుని అ౦కము నిలయముగా చేసుకొని ఉ౦టు౦ది.

7-10-2021 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకృత అనంకారం

8-10-2021 ఆశ్వయుజ శుద్ధ విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.

09.10.2021 ఆశ్వయుజ శుద్ధ తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి

10-10-2021 ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి

11-10-2021 సోమవారం రోజున ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్ఠి ఒకేరోజు వచ్చినందున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి

12-10-2021 ఆశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)

13-10-2021 ఆశ్వయుజ శుద్ధ శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి)

14-10-2021 ఆశ్వయుజ శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి) రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్