Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మూవీ ‘బం’గార్రాజు’. ఇందులో నాగార్జున స‌ర‌స‌న రమ్యకృష్ణ, నాగ‌ చైత‌న్య స‌ర‌స‌న‌ కృతి శెట్టి న‌టించారు. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘బంగార్రాజు’ జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

“2014లో మొదటగా నాగార్జున గారికి  సోగ్గాడే… కథను నెరేట్ చేశాను. 2016లో సోగ్గాడే రిలీజ్ అయింది. ఆ రోజే ‘బంగార్రాజు’ చేయాలని ఫిక్స్ అయ్యాం. మధ్యలో చైతన్యతో ఓ సినిమాను తీస్తే నాగార్జున గారే నిర్మించారు. మొదటి నుంచి కూడా మా మధ్య ర్యాపో ఉంది. ప్రతీ విషయంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు.

Bangarraju Shooting Completed

‘సోగ్గాడే చిన్ని నాయన’ లైన్ నాది కాదు. రామ్ మోహన్ గారి పాయింట్ అది. వేరే దర్శకుడిని ముందుగా అనుకున్నారు. నేను వేరే సినిమా కోసం నాగార్జున గారికి ఓ కథ వినిపించాను. అయితే ఆ కథ నా వద్దకు వచ్చింది. ఓ పదిహేను రోజులు ఆ కథ మీద కూర్చున్నాను. ఆ తరువాత కథను నాగార్జున గారికి వినిపించాను. ఫస్ట్ నెరేషన్‌లోనే ఒకే అయింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా విడుదలైన రోజే బంగార్రాజు సినిమా చేయాలని అనుకున్నాం కానీ.. చైతన్యతో ముందు ఓ సినిమా చేయమని నాగార్జున గారు అన్నారు కానీ.. అప్పటికే నాగ చైతన్య గారు సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు కమిట్మెంట్‌లతో ఉన్నారు. ఆ గ్యాప్‌లో నేను నేల టికెట్ సినిమాను చేశాను. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా లేట్ అయింది.

సోగ్గాడే సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు రాబోతోంది. ప్రీక్వెల్ కాదు. రెండు సినిమాలను కలిపి చూస్తే ఐదు గంటలు అవుతుంది. సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు అక్కడ మొదలవుతుంది. జనరేషన్ తేడా ఉంటుంది తప్ప బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలానే ఉంటుంది.

అనుకున్న సమయానికి ఈ సినిమాను రెడీ చేయడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. వేరే సినిమాలతో కాకుండా సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అందరూ పోల్చుతారు.. వీఎఫ్ఎక్స్‌ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అలా కాలంతో పాటుగా పరిగెత్తాల్సి వచ్చింది. సినిమాను ప్రారంభించడమే సంక్రాంతి టార్గెట్‌తో స్టార్ట్ చేశాం. ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నాం కానీ.. డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

Special Song From Bangarraju

టీం అంతా కలిసి పని చేశాం. అందరూ ఒకే సింక్‌లో ఉండేవాళ్లం. అందుకే ఈజీగా చేశాం. ఎక్కడా కూడా మిస్ అండర్‌స్టాండింగ్ రాలేదు. మొన్నే సెన్సార్ అయింది. జీరో కట్స్‌ తో యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా పండుగలా ఉందని అన్నారు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకూడదు.. అందుకే స్క్రిప్ట్‌ కు ఇంత సమయం పట్టింది. మొదట్లో కొంత మంది నాగ చైతన్యది గెస్ట్ కారెక్టర్ అని రాశారు. రెండు పాత్రలు సమానంగా ఉంటాయి. ఇద్దరూ హీరోలకు ప్రతీ ఎమోషన్ సమానంగా ఉంటుంది.

పాటలో ఫన్ ఉంటే నాగార్జున గారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందులో కళ్లు మీద పాట పాడారు. ఇందులో కబడ్డీ మీద పాట పాడారు. ఈ పాట ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన పాడితే ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే నాగార్జున గారితో పాడించాం. సెంటిమెంట్ కోసం కాదు. అఖిల్‌తో బంగార్రాజుకు సీక్వెల్ అంటే కష్టం. ముందు కథ రాసిన నేను సంతృప్తి చెందాలి. ఆ తరువాత వారిని మెప్పించాలి. ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితే ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే లేదు.

ఈ సినిమాకు సంగీతమే ప్రధాన బలం. ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఇంకా మూడు పాటలు రానున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియో ఎంత బాగుంటుందో.. మేకింగ్ పరంగా కూడా అంతే బాగుంటుంది. ఆర్ఆర్ అద్బుతంగా ఉంటుంది. మాకే కంట్లో నీళ్లు తిరిగాయి. జనవరి 9న మ్యూజికల్ ఈవెంట్ ఉంది. అందులోనే పాటలు విడుదల చేస్తాం. నేటివిటీ ఉండాలి.. దర్జాగా ఉండాలి అనే ఆలోచనల్లోంచే బంగార్రాజు గెటప్‌ను అనుకున్నాం. సూట్, బూట్ వేసుకుంటే బయట అందరూ ఫాలో అవ్వలేరు. అందుకే అందరికీ సింపుల్‌గా అనిపించాలనే పంచెకట్టుని పెట్టాం.

Naa Kosam Song

సినిమాలో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌ లుంటాయి. అందులో నాలుగు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. ఇంకోటి ఆర్కే చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌ లో ఇద్దరు హీరోలకు సమానంగా ఉంటాయి. చాలా తెలివైనదాన్ని అని అనుకునే అమాయకురాలి పాత్రలో కృతి శెట్టి కనిపిస్తుంది. విలేజ్‌లో ఉండి. బీటెక్ చదివి తనలాంటి తెలివైన అమ్మాయిలు ఊర్లో లేరని అనుకునే పాత్రలో నటించింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఉన్నట్టుగా రమ్యకృష్ణ గారి పాత్ర కంటిన్యూ అవుతుంది.

ప్రతీ దర్శకుడి అన్ని రకాల సినిమాలను చేయాలని ఉంటుంది. నేను నెక్స్ట్ చేసే సినిమా మాత్రం ఈ జానర్‌లో ఉండదు. ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ మాత్రం ఉండాలి. ఎమోషన్ కనెక్ట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది. కామెడీ సినిమా అయినా కూడా ఎమోషనట్ టచ్ అవ్వాల్సిందే. ఈవీవీ గారి సినిమాల్లో కామెడీ ఉన్నా కూడా ఎమోషన్ ఉంటుంది. జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఓ సినిమా అనుకున్నాను. అందులో యంగ్ పాత్రలో నాగ చైతన్య, మిగిలిన పాత్రలో నాగార్జున గారు అని అనుకున్నాను. ఆ కథ అయితే ఉంది. ఎప్పుడు చేస్తానో తెలీయ‌దు. జ్ఞానవేల్ రాజా గారితో ఓ సినిమా ఉంటుంది. కథ, హీరో అనేది ఇంకా నిర్ణయించలేదు. హీరోను బట్టి ద్విభాష చిత్రంగా ఉండొచ్చు. కానీ నేను మాత్రం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాను తీస్తాను. నాకు పాన్ ఇండియా ఆలోచనలు లేవు. ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. వెబ్ సిరీస్‌ల గురించి ఆలోచించడం లేదు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com