Tuesday, January 21, 2025
Homeసినిమావినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘సీటీమార్‌’ రిలీజ్‌

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘సీటీమార్‌’ రిలీజ్‌

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ…  “ఎగ్రెసివ్ స్టార్‌, యాక్ష‌న్ హీరో అయిన గోపీచంద్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మా ‘సీటీమార్‌’ను సెప్టెంబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. అయితే పండ‌గ రోజుల్లో ప్ర‌తి తెలుగువాడు కుటుంబంతో క‌లిసి సంతోషంగా ఉంటారు. ఆ సంతోషాన్ని ఎక్కువ చేసే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటారు ఆడియెన్స్‌. అందుకోసం మంచి సినిమాను చూడాల‌నుకుంటారు. అలాంటి వారికి మా ‘సీటీమార్‌’ మంచి విందు భోజ‌నంలా ఉంటుంద‌ని నిర్మాత‌గానే కాదు, స‌గ‌టు ప్రేక్ష‌కుడిగా భావించి మా చిత్రాన్ని వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నాం”

“గోపీచంద్‌ గారు ఆంధ్ర టీమ్ క‌బ‌డ్డీ కోచ్‌గా, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టించారు. ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌ల్లో మెప్పిస్తార‌న‌డంలో సందేహం లేదు. స్పోర్ట్స్ మూవీ అంటే ఎలా ఉండాలో అదే రేంజ్‌లో సినిమాను రూపొందించాం. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మా సినిమాకు మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అండ్ టీమ్ వ‌ర్క్‌ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ఇక డైరెక్ట‌ర్ సంపత్ నందిగారి టేకింగ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను ప‌ర్‌ఫెక్ట్ గా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా సినిమాను డైరెక్ట్ చేశారు. వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్లలో వ‌స్తున్న మా సీటీమార్ ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుందని చెబుతున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్