Sunday, January 19, 2025
HomeTrending Newsఅప్పులతోనే పాలన : అశోక్ బాబు

అప్పులతోనే పాలన : అశోక్ బాబు

ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు అన్నారు. నేడు 9వ తేదీనాటికి కూడా ఇంకా రాష్ట్రంలో 30శాతం మంది ఉద్యోగులకు జీతాలు అందలేదని, ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.   ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానిలో 90వేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని, వారికి మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారని, మరికొంతమందికి 20శాతం కోత విధించి తర్వాతా ఎప్పుడో ఇస్తున్నారని అశోక్ బాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుల మీద ఆధారపడి పాలన సాగిస్తోందన్నారు.

నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు,  మరో నాలుగులక్షల మంది పెన్షనర్ల తోపాటు  వివిధ రంగాల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 13   లక్షల మందికి ప్రతినెలా దాదాపు 5,500 కోట్ల రూపాయల చెల్లించాల్సి ఉంటుందని, దీనికి తోడు సామాజిక పెన్షన్ల కోసం మరో 1500 కోట్లు అవసరమని, అంటే ప్రతి ఒకటో తారీఖు నాటికి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు.  రెవెన్యూ లోటు కింద కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తోదని, ఆదాయం కూడా ఏమీ తగ్గలేదని, వ్యాట్ రూపంలో వస్తూనే ఉందని అశోక్ బాలు పేర్కొన్నారు.

ఈ ఏడాదికి 48 వేల కోట్లు అప్పు పరిమితి ఉంటే ఇప్పటికే 52వేల కోట్లు తీసుకు వచ్చిందని, మరో 28 వేల కోట్ల రూపాయల వరకూ అవసరమని చెబుతోందని వివరించారు. అయితే ఈ డబ్బు  వెళుతోందన్న విషయమై ప్రభుత్వ కనీసం ఓ శ్వేతపత్రం కూడా ఇవ్వడం లేదన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ తరహాలో జగన్ పాలన సాగుతోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్