Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆదిత్య నాధ్ దాస్ సర్వీస్ పొడిగింపు

ఆదిత్య నాధ్ దాస్ సర్వీస్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.. వాస్తవానికి ఆదిత్యా నాధ్ దాస్ ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.  దీనితో  అయన మరో మూడు నెలలు  జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

2021 జనవరి 1 నుంచి ఆదిత్యనాథ్‌ ఏపి సిఎస్ గా కొనసాగుతున్నారు. జూన్ 30వ తేదీన రిటైర్‌ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సిఎస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని సిఎం జగన్  కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి సర్వీస్ పొడిగిస్తూ నేడు ఉత్తర్వులు వెలువరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular