Monday, November 25, 2024
HomeTrending NewsTDP: బాబు అరెస్ట్ పై గవర్నర్ ఆశ్చర్యం: అచ్చెన్న

TDP: బాబు అరెస్ట్ పై గవర్నర్ ఆశ్చర్యం: అచ్చెన్న

రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  ప్రతిపక్ష నేత , 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసి, ప్రపంచ దేశాల్లో పేరున్న వ్యక్తిని తనకు కూడా తెలియకుండా అరెస్ట్ చేశారని గవర్నర్ తమతో అన్నారని పేర్కొన్నారు.  విశాఖపట్నం పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేసిన గవర్నర్  జస్టిస్ అబ్దుల్ నజీర్ ను అచ్చెన్న నేతృత్వంలోని టిడిపి బృందం కలుసుకుని చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టు, రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతలపై వినతిపత్రం సమర్పించారు. బాబు అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా చిత్తు చిత్తుగా ఓడిపోతామని తెలిసే తన నాయకుడికి ఎలాంటి సంబంధం లేని కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారని అచ్చెన్న ఆరోపించారు.  ఇటీవలే ఓ జాతీయ చానెల్ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీ 15 ఎంపి స్థానాలు గెల్చుకుంటుందని తేలిందని, పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తే వైసీపీకి అడ్రస్ గల్లంతు అవుతుందని తేలిందని, ఐ-ప్యాక్ కూడా కనీసం ఐదు సీట్లు కూడా రావని తేలిందన్నారు.  పైగా ఈ ప్రభుత్వం చేస్తోన్న అవినీతి, అక్రమాలపై పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారని, దీన్ని ఓర్వలేకనే అరెస్టు చేశారని విమర్శించారు.  నాలుగేళ్లపాటు ఏం చేశారని, ఇప్ప్పుడే ఎందుకు ఈ కేసుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, సంక్షోబాలను అవకాశంగా మలచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్