Friday, November 22, 2024
HomeTrending Newsకేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు

కేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు

Grain Collection  :   నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారని, మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు అని కేంద్రమంత్రి మాట్లాడటం తెలంగాణ ను అవమాన పరచడమే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీల కోసం వెళతారు. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామన్నారు. అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు. తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. తెరాస శాసనసభపక్ష కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి  శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారని, పార్టీ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయని మంత్రి ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మంత్రులు హైద్రాబాద్ రావచ్చు అయితే పులి రెండు అడుగులు వెనకేసిన మాత్రానా వెనకబడ్డట్టు కాదన్నారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తామని తెలిపారు.

రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం. కానీ తెలంగాణలో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, మా మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు. ప్రైవేటుగా ఢిల్లీ కి వెళ్ళలేదని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. యాసంగిలో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద కోపంతో అధికార దాహం తో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ కన్నా గొప్పగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎం చేస్తున్నారో శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురి కాక తప్పదు. పంజాబ్ కో విధానం కర్ణాటకకో విధానం తెలంగాణ కు ఓ విధానమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణకు క్షమాపణ చెప్పి కేంద్రం రైతులకు న్యాయం చేయాలన్నారు. ధాన్యం సేకరణ పై కేంద్రం హామీ లేఖ ఇస్తే ఢిల్లీ ఒడిపోయినట్టు కాదని, తెలంగాణ ఉద్యమంలో మోడీ సహా బీజేపీ నేతలు ఏం చెప్పారు. ఇపుడు ఏం చేస్తున్నారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చెప్పిన మోడీ మాట తప్పారని, రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం తెలంగాణ కు న్యాయం చేయడం లేదన్నారు. బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ, మహిళ రిజర్వేషన్ల పై కేంద్రం తెలంగాణ తీర్మానాలను పక్కన బెట్టిందని, కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు ఆయన్ను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారని విమర్శించారు. వారి కుట్రలను ఛేదిస్తామని, బీజేపీని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుందని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

Also Read : కేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్