NZ-RSA 2nd Test: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. బ్యాటింగ్ లో నిలకడగా రాణించిన ఆ జట్టు బౌలింగ్ లో కూడా సత్తా చాటి న్యూజిలాండ్ ను కట్టడి చేసింది. రాబడ, మార్కో జన్సేన్ లు వరుస వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా మరో 126 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. తెంబా బావుమా-29; రస్సీ వాందర్ దస్సేన్-35; మార్కో జన్సేన్-37; మహారాజ్-36 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 4; మాట్ హెన్రీ-౩; జేమిసన్-2; టిమ్ సౌతీ ఒక వికెట్ సాధించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కివీస్ 4 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాథమ్ డకౌట్ గా వెనుదిరిగాడు. కాసేపటికే మరో ఓపెనర్ యంగ్ (౩) కూడా ఔటయ్యాడు. డెవాన్ కాన్వే (16), టామ్ బ్లండెల్(6)లు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. హెన్రీ నికోలస్-39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. డెరిల్ మిచెల్-29; కోలిన్ డే గ్రాండ్ హోమ్-54 పరుగులతో క్రీజులో ఉన్నారు. గ్రాండ్ హోమ్ కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేయడం విశేషం.
సౌతాఫ్రికా బౌలర్లలో రబడ మూడు, మార్కో జేమిసన్ రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : కివీస్ తో రెండో టెస్ట్: సౌతాఫ్రికా 238/3