Saturday, January 18, 2025
HomeTrending Newsపేరంటాలపల్లి విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్

పేరంటాలపల్లి విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్

Green Signal For Perantalapally Excursion :

ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా శనివారం పైలెట్ బోటు వెనుక లాంచీలు జల విహార యాత్రకు పేరంటాలపల్లి స్థానిక లాంచీల రేవు నుండి బయలుదేరి వెళ్ళాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విహారయాత్ర ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలపై విశ్వసనీయతను పెంపొందించే దిశగా dry run ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. ఈ పైలెట్ విధానం అన్ని విధాల విజయవంతం చేసి  పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని ఆయన పర్యాటక అధికారులను ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ బోటుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని పరిమితికి మించి బోటుల్లో ఎక్కించకూడదని బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ నిబంధనలు బోటు ఓనర్లు పాటించకపోతే వాళ్ళ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బోటు లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు టి ఈ ఎం రాజు, డివిజనల్ మేనేజర్ వీరనారాయణ, దేవీపట్నం ఎస్సై కె. వి. నాగార్జున, తహశీల్దార్ ఎం.వీర్రాజు, డి టి  బాపిరాజు  తదితరులు పేరంటాలపల్లి జల విహార యాత్రకు బయల్దేరి వెళ్లారు

Also Read :  మత్స్యకారులు సురక్షితం

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్