Friday, March 29, 2024
HomeTrending Newsఫుడ్ జోన్ల ఏర్పాటుతో రైతులకు మేలు

ఫుడ్ జోన్ల ఏర్పాటుతో రైతులకు మేలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసిందని, దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. రాష్ట్రంలో హరిత, నీలి, గులావీ, శ్వేతా విప్లవాలు సృష్టిస్తున్నామని, ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్ గర్ లాంటి జిల్లాలు మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నయని, వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని తెలిపారు. ఫుడ్ జోన్ల ఏర్పాటులో ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణాలో ఫుడ్ ప్రోసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు కేటియార్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పండే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా జోన్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేకంగా తెలంగాణా  ఫుడ్ మ్యాప్ తయారు చేసింది.

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉందని, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారా ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫుడ్ ప్రోసెసింగ్ జోన్ల ఏర్పాటులో మిల్లర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని పౌరసరఫరాలు, బిసి సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  పారా బాయిల్డ్, స్టీమ్ మిల్లులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, దీనికి అనుగుణంగా ఈ జోన్లలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లర్లకు తోడ్పాటు అందిస్తే చైనా లాంటి దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్