3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeతెలంగాణకాంగ్రెస్ దుస్థితికి నిదర్శనం: షర్మిల

కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనం: షర్మిల

తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణాలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా  జులై 8న దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ టీపీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.  అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవ సందర్భంగా లోటస్ పాండ్ లోని కార్యాలయంలో https://teamyssr.com/ వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి షర్మిల మాట్లాడారు.

ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమని, కానీ అవన్నీ చేయలేనివి చేసేదే 5th ఎస్టేట్ అని, అదే ప్రజల చేతుల్లో చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ఆయుధమని కార్యకర్తలకు వివరించారు.  అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు.

అందరికీ ఉచిత విద్య, వైద్యం తమ పార్టీ విధానాలుగా ఉంటాయని, అన్ని కులాలు, మాటలకీ అతితంగా పార్టీ ఉంటుందని వివరించారు.  పార్టీ విధ్యానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సోషల్ మీడియా పాత్ర ఏంటో కీలకమని షర్మిల అభిప్రాయపడ్డారు. మీరు లేకుండా నేనేం చేయలేనంటూ అభిమానులతో అన్నారు.

టీఆర్ఎస్  కు సోషల్ మీడియాకు  ప్రత్యేకంగా ఉద్యోగులు ఉన్నారని, కానీ మనకు ఆ అవసరం లేదని, మన పార్టీ కార్యకర్తలే రథ సారధులని చెప్పారు.

సోషల్ మీడియా లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదని, మీ లైక్స్, షేర్ అన్ని వేదికల్లో యాక్టివ్ గా ఉండాలని, అన్యాయాన్ని ఎదిరించాలని పిలుపు ఇచ్చారు. తప్పుడు, పేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్