Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్బెంగుళూరుకు భంగపాటు

బెంగుళూరుకు భంగపాటు

GT-again: ఐపీఎల్ లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.  నేడు బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లతో విజయం సాధించింది. రాహుల్ తెవాటియా 25 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లతో 43 పరుగులతో నాటౌట్ గా నిలిచి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 11 పరుగుల వద్ద కెప్టెన్ డూప్లెసిస్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో వికెట్ కు కోహ్లీ- రజత్ పటిదార్ 99 పరుగుల భాగస్వామ్యం  నెలకొల్పారు.  పటిదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు, కోహ్లీ నిదానంగా ఆడి 53 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 58 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. గ్లెన్ మాక్స్ వెల్-33; మహిపాల్ లార్మోర్ -16 పరుగులు చేయడంతో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ రెండు; షమీ, అల్జారి జోసెఫ్, రషీద్ ఖాన్, ఫెర్గ్యుసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ తొలి వికెట్ కు 51 పరుగులు చేసింది, వృద్ధిమాన్ సాహా 29 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభమన్ గిల్­-31; సాయి సుదర్శన్-20 చేసి ఔటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో డేవిడ్ మిల్లర్- 39 (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్); రాహుల్ తెవాతియా రాణించి మరో మూడు బంతులుండగానే విజయం సాధించింది.

బెంగుళూరు బౌలర్లలో షాబాజ్, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

తెవాటియాకు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఆసియా బ్యాడ్మింటన్: సెమీస్ లో సింధు ఓటమి

RELATED ARTICLES

Most Popular

న్యూస్