Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవా జట్లు తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి.
గుజరాత్ జెయింట్స్ –హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 32-26 తో గుజరాత్ గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 19-12తోముందంజ లో ఉన్న గుజరాత్ రెండో భాగంలో 13-14తో ఒక పాయింట్ వెనుకబడింది. మ్యాచ్ ముగిసే నాటికి 6 పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ ఆటగాడు అజయ్ కుమార్ 11పాయింట్లు సాధించాడు.
దబాంగ్ ఢిల్లీ – యూ ముంబా జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 36-30తో ఢిల్లీ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 12-12తో రెండు జట్లూ సమంగా నిలిచాయి. రెండో భాగంలో ఢిల్లీ మెరుగైన ఆటతీరు ప్రదర్శించి 24-18తో ఆధిక్యం సంపాదించింది. సమయం పూర్తయ్యే నాటికి 6 పాయింట్ల తేడాతో ఢిల్లీ విజయ బావుటా ఎగురవేసింది. ఢిల్లీ ఆటగాడు విజయ్ 12 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (53 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (46); పాట్నా పైరేట్స్ (45); హర్యానా స్టీలర్స్ (43); యూ ముంబా (42); బెంగాల్ వారియర్స్ (41); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: పట్నాపై జైపూర్; బెంగుళూరుపై తమిళ్ విజయం