Saturday, March 14, 2026
HomeTrending NewsBaramulla: కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌...ఇద్దరు ఉగ్రవాదుల హతం

Baramulla: కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌…ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందడంతో గురువారం తెల్లవారుజామున భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సైన్యం కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

వారిద్దరు లష్కరే తొయీబాకు చెందిన వారని, సోపియాన్‌ జిల్లాకు చెందిన షకీర్‌ మాజిద్‌ నాజర్‌, హానన్‌ అహ్మద్‌గా గుర్తించామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్‌, పిస్తోల్‌, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, గత 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. దీంతో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular