ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ అని ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మాణపరంగా  ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేసి టీజర్ రిలీజ్ చేశారు.

మహేష్ ని మాస్ లుక్ లో.. ఇంకా చెప్పాలంటే అభిమానులు కోరుకునే విధంగా ప్రజెంట్ చేశారు త్రివిక్రమ్. అంతే.. ఈ టీజర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. అభిమానులకే కాదు సినీ ప్రియులందరికీ గుంటూరు కారం ఘాటు బాగా నచ్చింది. ఈ మాస్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో దూసుకెళుతుంది. దీనిని బట్టి గుంటూరు కారం టీజర్ జనాలకి ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారట.

త్వరలో తాజా షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నారు. మహేష్‌ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ టీజర్ చూసిన జనాలు.. త్రివిక్రమ్ మారిపోయారు సార్ అంటున్నారంటే.. ఏ రేంజ్ లో ఉందో ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం థియేటర్లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *