కనీవినీ ఎరుగని రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు అమాంతం పెరిగాయి. ఓంరౌత్ ‘ఆదిపురష్’ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతిసనన్ సీతగా నటించింది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించాడు. ఈ సినిమాను జూన్ 16న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ జూన్ 6న అత్యంత ఘనంగా తిరుపతిలో నిర్వహించనున్న ఈ ఈవెంట్ కి మేకర్స్ కోట్లలో ఖర్చు పెడుతున్నారట. ఉహించని లెవెల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని ఈ ఈవెంట్ నుంచి థ్రిల్ చేయనున్నాయని కూడా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే… గతంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేయని విధంగా సరికొత్త ప్లానింగ్ తో వావ్ అనిపించేలా ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జై శ్రీరామం అంటూ మారుమ్రోగేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని.. బాహుబలి రేంజ్ సక్సెస్ సాధిస్తామని టీమ్ థీమగా ఉన్నారు. మరి.. ఆదిపురుష్‌ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *