చిరు, బోయపాటితో గీతా సినిమా ఎప్పుడు..?

అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను ‘సరైనోడు’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫైనల్ గా సక్సెస్ అయ్యింది. దీంతో బోయపాటితో గీతా సంస్థలో మరో సినిమా చేస్తామని.. అది కూడా చిరంజీవి, బోయపాటి కాంబోలో మూవీ నిర్మిస్తామని అల్లు అరవింద్ ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. ‘2018’ అనే మలయాళ సినిమాను తెలుగులో గీతా సంస్థ రిలీజ్ చేసింది. ఈ డబ్బింగ్ సినిమా సక్సెస్ అయ్యింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను నెక్ట్స్ మూవీ మా సంస్థలోనే ఉంటుందని.. ఇటీవల బోయపాటిని రామోజీ ఫిలింసిటీలో కలిసానని.. తప్పకుండా సినిమా చేద్దామని బోయపాటి అన్నారని చెప్పారు. అంతే కాకుండా ఇద్దరు హీరోల పేర్లు చెప్పి ఆ ఇద్దరిలో ఎవరితో అయినా ఓకే అన్నానని కూడా తెలియచేశారు. అయితే.. బోయపాటితో సినిమా చేసేందుకు సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ, ఏకే ఎంటర్ టైన్మెంట్ సంస్థ, 14 రీల్స్ సంస్థ, నిర్మాత సుధాకర్ చెరుకూరి పోటీపడుతున్నారు. ఇప్పుడు గీతా సంస్థ కూడా లైన్ లోకి వచ్చింది. దీంతో బోయపాటి నెక్ట్స్ ఎవరి బ్యానర్ లో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

అల్లు అరవింద్ చెప్పిన ఆ ఇద్దరు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ అయ్యుంటుందని టాక్ వినిపిస్తుంది. ముందుగా బాలయ్యతోనే ఉంటుంది కాబట్టి.. ఈ చిత్రాన్ని రెండు సంస్థలు కలిపి చేసే అవకాశం ఉందని.. అందులో గీతా సంస్థ తప్పకుండా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం బోయపాటి రామ్ తో మూవీ చేస్తున్నాడు. వచ్చే నెలకి ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత నెక్ట్స్ మూవీ గురించి నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *