రామ్, పూరి డబుల్ ‘ఇస్మార్ట్’ అప్ డేట్ ఏంటి..?

రామ్, పూరి జగన్నాథ్ కలిసి చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇద్దరి కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. లైగర్ తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తారో అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ఇటీవల రామ్ తో పూరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ‘ఇస్మార్ట్’ అనే సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ అప్ డేట్స్ ఇస్తారా అని అటు రామ్, ఇటు పూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

పూరి ఒక స్టోరీని చాలా తక్కువ టైమ్ లో రాసేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తీసిన టైమ్ లో తన స్టైల్ కి భిన్నంగా రామ్ తో కథ గురించి స్క్రీన్ ప్లే గురించి.. క్యారెక్టరైజేషన్ గురించి బాగా చర్చించి ఆతర్వాత కథ రాశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారట. పైగా సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు ఉంటాయి. అందుచేత రామ్ లుక్, క్యారెక్టరైజేషన్ గురించి సుధీర్ఘంగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా షూటింగ్ స్టార్ట్ చేయకుండా మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు పూరి. అందుకనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోని విధంగా కథ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ బాగా కేర్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్లు, టెక్నీషియన్స్ ఎవరనేది ఇంకా లాక్ చేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు. మరి.. డబుల్ ఇస్మార్ట్ తో పూరి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *