జక్కన్న ‘ఈగ 2’ కూడా ప్లాన్ చేస్తున్నారా..?

రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తే బాగుంటుందని.. ‘ఈగ 2’ ఎప్పుడు అని నాని జక్కన్నను అడుగుతుండేవాడు. అయితే.. రాజమౌళి అప్పట్లో సీరియస్ గా తీసుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈగ 2 తీయాలని ఆలోచిస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని ప్రకటించారు. అలాగే బాహుబలి 3 ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు.. ఈగ 2 మైండ్ లోకి వచ్చింది. మరి.. ఎప్పుడు ఈగ 2 ఉంటుంది అంటే.. ఈ సినిమానే ముందుగా తెరకెక్కించాలని సీరియస్ గా తన టీమ్ తో చర్చలు జరుపుతున్నారట.

అసలు మహేష్ బాబుతో సినిమా ఆలస్యం అవుతుండడం వలన ఈ గ్యాప్ లో ఈగ 2 తీసేద్దాం అనుకున్నారట. రాజమౌళి చేయిపడితే అది 100 కోట్ల బడ్జెట్ దాటాల్సిందే. పైగా మహేష్ బాబుతో చేయనున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాల్సిన సినిమా కావడంతో దాని పై ఫుల్ పోకస్ పెట్టాలి. అందుచేత ఇప్పటికిప్పుడు తీయాలనుకున్న ఈగ 2 ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కనపెట్టారట. అయితే… మహేష్ బాబుతో చేయనున్న సినిమా పూర్తైన తర్వాత చేసే సినిమా మాత్రం ఈగ 2 అని సమాచారం. ఒక టీమ్ కోసం వర్క్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

మహేష్‌ బాబుతో చేయనున్న సినిమా పాన్ వరల్డ్ సినిమా. పైగా 1500 కోట్ల బడ్జెట్ అంటే.. భారతదేశంలోనే అంత బడ్జెట్ తో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. కాబట్టి ఆతర్వాత జక్కన్న చేసే సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాగే బిజినెస్ కూడా అంతకుమించి అన్నట్టుగా జరిగే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగి ఈగ 2 సెట్స్ పైకి వస్తే మాత్రం నేచురల్ స్టార్ నానికి ఇది బంపర్ ఆఫరే అని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *